calender_icon.png 4 April, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల అభివృద్ధే లక్ష్యం

02-04-2025 12:00:00 AM

ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఆదివాసీలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు యం త్రాంగం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం ఉట్నూర్‌లోని బీ కొమరం భీమ్ కాంప్లెక్స్‌లో ఆది వాసులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆదివాసులకు సంబంధించిన తొమ్మిది తెగల నాయకులు, పెద్దలు, రాయి సెంటర్ నిర్వాహాకులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గతంలో పని చేసిన పోలీసు ఉన్నతాధికారులందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియజేశారని తెలిపారు. ఆదివాసీల సం స్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్నాయని, అవి తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రజలు ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.

ఆదివాసీల తొమ్మిది తెగల సంస్కృతి, సాంప్రదాయాల ను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆదివాసీ నాయకులు తెలిపిన సమస్యలను తనకు సాధ్య మైనంత వరకు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తామని యువత ఉద్యోగాలు చేసే విధంగా నాయకులు తల్లిదండ్రుల ప్రోత్సహించాలని తెలిపారు.

చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామాన జిల్లా పోలీసు యంత్రాంగంతో పోలీసు మీకోసం కార్యక్రమాలను నిర్వహించి చైతన్య పరుస్తామని తెలిపారు. ఆదివాసులు గంజాయి, మాదకద్రవ్యాల బారిన పడకుండా దళారుల ద్వారా మోసపోకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ కాజ ల్ సింగ్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేష్, జిల్లా మేడి మెస్రం దుర్గు పటేల్, మెస్రం మనోహర్, మెస్రం వెంకటరావు కెస్లాపూర్ ఆలయ పీఠాధిపతి ఆదివాసి సార్ మేడిలు, పటే ల్, తొమ్మిది తేగల నాయకులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.