calender_icon.png 20 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగం అభివృద్ధి.. ఉపాధ్యాయుల సంక్షేమమే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యం: చావ రవి

14-04-2025 12:08:29 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా టిఎస్ యుటిఎఫ్ కృషి చేస్తోందని టిఎస్ యుటి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టిఎస్ యుటిఎఫ్) 12 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) ఉపాధ్యక్షులు మోతు కూరి సంయుక్త  టిఎస్  యుటిఎఫ్ పతా కాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చా వ రవి  మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులు బతకాలంటే ప్రభుత్వం ప్రాథమిక విద్యపై కేంద్రీకరించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిం చాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, బకాయి ఉన్న ఐదు డిఎలను వెంటనే విడుదల చేయాలని, నగదురహిత వైద్యం అందించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, 1.07.2023 నుండి రెండవ పిఆర్సీ అమలు చేయాలనిడిమాండ్ చేశారు.