calender_icon.png 18 April, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భద్రతే లక్ష్యం

10-04-2025 12:59:14 AM

వికారాబాద్, ఏప్రిల్ -9 డాగ్ స్కాడ్ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం ప్రజల భద్రతను కా పాడటమేనని జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి అన్నారు. ఎస్పీ ఆదేశం మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్లలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలపై ఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గుర్తింపు, నేర చర్యలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు.

అం తేకాకుండా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడం కూడా ఈ తనిఖీల ప్రధాన భాగంగా పేర్కొన్నారు. తనిఖీల సమయంలో అధికారులు ప్రజలతో మమేకమై, చట్టబద్ధంగా, మర్యాదపూర్వకంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలి పారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితు లు గమనించినా లేదా శాంతి భద్రతల విషయంలో సందేహాలు ఉన్నా, వెంటనే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు తెలిపారు.