calender_icon.png 18 January, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరికం లేని గ్రామాలే లక్ష్యం

14-08-2024 12:25:43 AM

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 

రాజేంద్రనగర్, ఆగస్టు 13: పేదరికం లేని గ్రామాలే తన లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్)లో జరిగిన పంచాయతీరాజ్ 66వ జనరల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్యశాలలు తదితరాలకు మంచి భవనాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పీహెచ్‌డీ కోసం న్యూఢిల్లీ జేఎన్‌యూతో రెండు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కమలేశ్ పాశ్వాన్ గ్రామ్‌రోజ్‌గార్ సేవక్ (జీఆర్‌ఎస్) కోసం ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించారు. అనంతరం మంత్రి క్యాంపస్‌లోని రూరల్ టెక్నాలజీ పార్కును సందర్శించారు. పార్క్‌లోని మడ్ బ్లాక్ తయారీ యూనిట్‌ను సందర్శించారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి శైలేష్‌కుమార్ సింగ్, ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్ జనరల్ తనూజ పాల్గొన్నారు.