01-03-2025 12:00:00 AM
ప్రజలు సుఖసంతోషాలతో జీవించడమే లక్ష్యం
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : అభివృద్ధికి కంకణ బద్ధులమై పనిచేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కరివేన, చౌల తండా ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్షను అయినా భూత్పూర్ మండలం (మదిగట్ల స్టేజ్) నాగర్ కర్నూల్ పీడబ్ల్యూ రోడ్ నుండి కరివేన, వయా చౌలతాండ వరకు రూ 2 కోట్ల 20 లక్షల తో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన, కరివేన గ్రామంలో మల్లన్న జాతర మహోత్సవ వేడుకల్లో, పోతులమడుగు గ్రామంలో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పదవ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ ఎమ్మె ల్యే అందజేశారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో కరివెన ప్రాజెక్టుపై నిర్వహించిన రివ్యూలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా పనులకు సంబం ధించి పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చించి, గుత్తేదారులు సకాలంలో పనులు చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.