ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...
మణుగూరు (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ఆళ్లపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోతురు నూతన గ్రామపంచాయితీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆళ్ళపల్లి రైతు వేదికలో 25 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని అర్హులయిన వారికి కొత్త సంఘాల ఏర్పాటుకు పాస్ బుక్కులు అలాగే పాత సంఘాల వారికి కోటి రూపాయల చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పెరటి కోళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం అమలు పరిచే ప్రతీ ఉపాధి కల్పన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాయం రామ, నరసయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.