calender_icon.png 19 February, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ రహిత తెలంగాణే లక్ష్యం

14-02-2025 12:10:25 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): రాష్ర్టంలో క్షయ నిర్మూ లన లక్ష్యంగా పనిచేస్తున్నామని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లా ల్లో 100 రోజులపాటు క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను ఉధృతం గా నిర్వహిస్తున్నామని చెప్పారు.

క్షయ వ్యాధి బాధితులకు సాయం చేస్తున్న 8 ఫార్మా కంపెనీల ప్రతినిధులకు గురువారం తన నివాసంలో మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు. క్ష యవ్యాధి బాధితులకు చికిత్స కాలం లో 8 ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులతో రూ. 2.80 కోట్ల విలు వైన న్యూట్రిషన్ కి ట్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.

కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ డీజీ కమలాసన్‌రెడ్డి, టీబీ కంట్రోల్ డీడీలు డాక్టర్ రాజేశం, రామ్‌దాన్ పాల్గొన్నారు.