calender_icon.png 22 February, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీ రహిత మండలమే లక్ష్యం

22-02-2025 12:20:04 AM

కల్లూరు, ఫిబ్రవరి 21 : ఖమ్మం జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్ సహకారంతో కల్లూరు పీహె సి పరిధిలోని కిష్టయ్య బంజార గ్రామ పంచాయతీలో టీబీ వ్యాధిపై శుక్రవారం అవగాహన నిర్వహించి జరిగింది.టీబీ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి కళ్ళే నమూనాలు సేకరించడం జరిగింది.

ఈ సందర్బంగా కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీబీ నోడల్ పర్సన్ రామారావు మాట్లాడుతూ కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతి పంచాయతీని టీ.బి. ఫ్రీ పంచాయతీగా మార్చడం కోసం టీబీ నిర్మూలన విభాగంలోని టీబీ చికిత్స సూపర్వుజర్ వై.సురేష్, ల్యాబ్ సూపర్వుజర్ సంజీవ్ కుమార్, వైద్య సిబ్బంది సహకారంతో పనిచేస్తున్నామని తెలియజేశారు.  కార్యక్రమంలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ టీ.వీ సత్యనారాయణ, ఏఎన్‌ఎం విజయలక్ష్మి నిర్మల,ఆశా కార్యకర్తలు రాణి, లక్ష్మి, పాల్గొన్నారు.