25-04-2025 01:34:45 AM
అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కలెక్టర్ నారాయణరెడ్డి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 24 : భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతిని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. గండి పేట్ మండలంలోని ఖానాపూర్ రైతు వేదిక ప్రాంగణంలో సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి హక్కుల రికార్డ్, భూ భారతి చట్టం పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా భూభారతి చట్టాన్ని రూప కల్పన చేశారని పేర్కొన్నారు. రైతు శ్రేయస్సు కోసమే భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు వివరించారు. భూ భారతితో రైతుల భూములకు పటిష్టమైన రక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో రాజేంద్రనగర్ ఆర్డిఓ వెంకట్ రెడ్డి, గండిపేట తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.