calender_icon.png 25 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నశా ముక్త్ తెలంగాణే లక్ష్యం

25-11-2024 01:33:21 AM

  1. డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం
  2. ఎన్డీపీఎస్ కేసుల్లో మెరుగైన ఫలితాలు 
  3. గతంతో పోల్చితే పెరిగిన తీర్పుల శాతం
  4. వివరాలు వెల్లడించిన డీజీపీ జితేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): నార్కోటిక్స్ డ్రగ్స్(మాదక ద్రవ్యాలు)పై పోరాటంలో తెలంగాణ పోలీసులు కీలక విజయాలను సాధించారని డీజీ పీ డా.జితేందర్ అన్నారు. 2024లో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల్లో వెల్లడైన తీర్పుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైందని డీజీపీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

డ్రగ్స్‌పై పోలీసు లు ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. 2024లో 226 ఎన్డీపీఎస్ కేసులు విచారణ కు రాగా, 39 కేసులకు తీర్పు వెల్లడైందని.. గతంతో పోల్చితే ఇది చాలా మెరుగైన ఫలితమన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, సైబరాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ యూనిట్లు  అద్భుత ప్రతిభ కనబరిచా యని పేర్కొన్నారు.

న్యాయస్థానం ముందు హాజరుపరిచిన 4 కేసుల్లో 17 మంది నిందితులకు 20 ఏళ్లు, ఒక కేసులో ఇద్దరికి 12 ఏళ్లు, 11 కేసుల్లో 19 మందికి పదేళ్లు, ఒక కేసులో ఒకరికి ఐదేళ్లు, మరో కేసులో ముగ్గురికి ఏడాది, మరో రెండు కేసుల్లో 8 మందికి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

ఈ కేసుల పరిష్కారానికి కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారు లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను డీజీపీ అభినందించారు. తెలంగాణ పోలీసుల కట్టుబాటు, అనుబంధ శాఖల సమన్వయంతోనే తీర్పుల శాతం పెరిగిందన్నారు. నశా ముక్త్ తెలంగాణ సాధనలో వందశాతం తీర్పుల లక్ష్యం గా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని డీజీపీ ప్రకటించారు. 

తీర్పుల శాతం పెరిగేలా చర్యలు

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీఏఎన్‌బీ) ఏర్పాటైనప్పటీ నుంచి పోలీసు లు శిక్షణ, వ్యూహాత్మక చర్యల ద్వారా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటున్నారని డీజీపీ తెలిపారు. మొత్తం 22,654 మం ది పోలీసు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రాసిక్యూషన్, రైల్వే శాఖల సిబ్బందికి 14 ప్రత్యేక శిక్షణ కోర్సుల ద్వారా ఎన్డీపీఎస్ చట్టం అమలుపై శిక్షణ అందించామన్నారు.

ఇందులో 56 బ్యాచ్‌లు, 6 టీజీపీఏ వద్ద నిర్వహించినట్లు వెల్లడించారు. అధికారులకు ఎన్డీపీఎస్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆరు డిటెయిల్డ్ గైడ్స్ ప్రచురించామని చెప్పారు. కోర్టు డ్యూటీ అధికారులకు ముఖ్యమైన ప్రక్రియలపై శిక్షణ, సాక్ష్యాల నిర్వహణ, బెయిల్ పిటిషన్‌లకు వ్యతిరేకంగా వాదన, కోర్టు ట్రయల్స్ నిర్వహణలో శిక్షణ ఇచ్చామన్నారు.

పర్యవేక్షణాధికారులకు (డిప్యూటీ ఎస్‌ఎస్‌పీ/ఏసీఎస్‌పీ/డీసీఎస్‌పీ/ఎస్‌ఎస్‌పీ) కూడా శిక్షణ ఇప్పించామన్నారు. అలాగే కమర్షియల్ క్వాంటిటీలు, విదేశీయుల సం బంధిత కేసుల్లో బెయిల్ వ్యతిరేక వాదనల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు మార్గదర్శకత అందించామన్నారు. న్యాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, నశా ముక్త్ తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నామని డీజీపీ డా. జితేందర్ పేర్కొన్నారు.