calender_icon.png 22 January, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలిండియా సాంస్కృతిక పోటీల విజేతలను అభినందించిన జిఎం

21-01-2025 08:20:23 PM

మందమర్రి (విజయక్రాంతి): కోల్ కత్తాలోని అస్సాంసోల్ లో ఇటీవల జరిగిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఏరియా కళాకారులను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ అభినందించారు. మంగళవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కళాకారులను ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. సింగరేణిలో మొదటిసారి ఆర్కెస్ట్రా విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్న సింగరేణి కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్ముందు మరిన్ని పథకాలు సాధించి సింగరేణికి కోల్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డివైపిఎం ఆసిఫ్, ఏఐటీయూసీ రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఆర్కెస్ట్రా టీం కెప్టెన్ డేవిడ్ సన్, కళాకారులు హేమంత్, ప్రభాకర్, సుదర్శన్, రాజేశ్వర రావు, అనిల్, సురేష్ లు పాల్గొన్నారు.