calender_icon.png 18 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విష్ణు మహిమ

18-01-2025 12:27:22 AM

ఒక రోజు అక్బర్ బీర్బల్‌ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.

‘బీర్బల్, నాకొక సందేహముంది తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తాడని నేను వేద పురాణాలలో ఉందని విన్నాను. ఎందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?’ అని అక్బర్ బీర్బల్ ని అడిగారు. 

బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు.. ‘సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!’.

కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. ‘ఈరోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు.. నీకు మంచి బహుమానమిప్పిస్తాను’ అని ఆ పనిమనిషికి చెప్పాడు. 

అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడా నీళ్లల్లో పడిపోయింది. అక్బర్ ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్లల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడసాగాడు. 

బీర్బల్ మడుగు గట్టున నిలుచుని.. ‘మహారాజా.. ఎందుకు మీరు నీళ్లల్లో దూకరు? సేవకు లని పురమాయిస్తే సరిపోయేది కదా?’ అన్నాడు. 

‘ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో.. విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడటానికి వెనకాడలేదు’ అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు. 

 వర్డ్‌ప్రెస్.కాం సౌజన్యంతో