calender_icon.png 9 April, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవోపేతంగా సీతారాముల కల్యాణం

07-04-2025 12:47:55 AM

  1. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి దంపతులు
  2. 50 కోట్లతో సిరుశనగండ్ల దేవాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు
  3. రామాలయంలో ఘనంగా సీతా రాముల కళ్యాణం   

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 6 (విజయక్రాం తి) / చారకొండ : జగదానంద కారకుడి కల్యాణ మహోత్సవాన్ని ఆయా ఆలయాల్లో అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రతువును కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయింది. పుణ్య పురుషుడిని.. ఆదర్శ పాలకుడిని మదినిండా తలు స్తూ భక్తజనం స్వామివారి సేవలో తరించింది.

రెండో భద్రాద్రిగా పేరొందిన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి వారి కల్యాణం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. దేవాలయం ముందు క ల్యాణ మంటపంలో చూడ చక్కగా అలంకరించిన వేదికపై మొదలైన సీతారామ చంద్ర స్వామి కల్యాణ క్రతువులో అన్ని ఘట్టాలనూ భక్తిశ్రద్ధలతో తిలకించి తన్మయత్వం పొందా రు.

దేవతామూర్తులకు పట్టు వస్త్రాల సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు పోసే వేడుకలను సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణలతో జిల్లాలోని పలు ఆలయా లు మారుమోగాయి. సిరసనగండ్ల ఆలయంలో ప్రభుత్వ తరఫున రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఎమ్మెల్సి దామోదర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఈ వేడుక కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఒడిలో ఓలలాడించింది. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు దంపతులు, జైపాల్ యాదవ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, టాస్క్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో ఎలాం టి సమస్యలు రాకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అ వాచనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కార్యక్ర మంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈవో ఆంజనేయులు, ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ సునీత, మాజీ సర్పంచులు యాతం శ్రీను, విజేందర్, మాజీ జడ్పీటీసీ వెంకట్ గౌడ్, నేతలు బలరాం గౌడ్, నర్సింహ్మా రెడ్డి, సురేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, మహేందర్ తదిత రులు పాల్గొన్నారు.

50 కోట్లతో దేవాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు

రెండో భద్రాదిగా పేరుగాంచిన గండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని 50 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రాంతానికి చెందిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డిని ఒప్పిస్తామని మంత్రి జూ పల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి అన్నారు. తక్షణమే రెండు కోట్ల నిధులను విడుదల చేస్తామని జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం సీతారాములు

పట్టు వస్త్రాలు సమర్పించిన 

ఎమ్మెల్యే దంపతులు

వనపర్తి,: భార్యాభర్తల అనుబంధానికి అన్నదమ్ముల అనురాగానికి, తండ్రి కొడుకుల మమకారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సీతారాములు అందరికీ ఆదర్శప్రాయులని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్బంగా గోపాల్ పేట మండలం లోని  కోదండ రామస్వామి ఆలయంలోని సీతారామ లక్ష్మణులకు ఆదివారం ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు.

ముం దుగా జిల్లా కేంద్రం లోని రామాల యం, గోపాల్ పేట మండలం బుద్ధారం గండి ఆంజనేయ స్వామి ఆలయంలోనూ ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశా రు. ఎమ్మెల్యే దంపతుల వెంట స్థానిక పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. 

కృష్ణమండలంలో  

కృష్ణ: మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ రామ నవమి వేడుకలను ఆదివారం భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఆలయా ల్లో వేదమంత్రాల మధ్య ఒక్కరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆల య కమిటీ సభ్యులు సీతారాముల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఉరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చారు. కన్నుల పండుగగా రా ములోరి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గ్రామ పెద్ద లు తదితరులు పాల్గొన్నారు.

రామకొండ గుట్టపై శ్రీరామనవమి వేడుకలు 

హాజరైన నారాయణపేట 

ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి దంపతులు 

కోయిలకొండ: మండల కేంద్రానికి సమీపంలోని కొలువుతిరిన రామకొండ గుట్టపై శ్రీరాముని ఆలయంలో సీత రాముల కల్యా ణం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేకంగా పూజా కార్యక్రమంలో నిర్వహించారు.

దైవ అనుగ్ర హం తోనే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారి కి తమ మొ క్కులను తీర్చుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పలు ఆలయాల్లో 

ఎమ్మెల్యే యెన్నం పూజలు

మహబూబ్ నగర్: శ్రీ సీతారాముల కృ పా కటాక్షం తో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ నగర్, శ్రీ రామాలయంలో, మన్నెంకొండ దేవస్థానంలో, టీచర్స్ కాలనీ, రామాలయం దేవాలయంలో, వీరన్నపేట శ్రీ సీతారాముల దేవాలయంలో, టిడి గుట్టలో శ్రీ రామాంజనేయ దేవాలయంలో, హన్వాడ మండలం పెద్దదర్ పల్లి గ్రామంలో, జరిగిన రాముల వారి కళ్యాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బుద్దారం సుధాకర్ రెడ్డి, స్థిత ప్రజ్ఞ, మహేష్ , మన్యం కొండ నరేందర్ రెడ్డి, రామస్వామి పాల్గొన్నారు.

ఐక్యతతోనే అందరి సంక్షేమం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్:  పేదల అభ్యున్నతి కోసమే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందని ఐక్యతతోనే అందరి సంక్షేమం సాధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎం పీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిజెపి 45వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను ఎంపీ ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేద్దామని పిలుపునిచ్చారు.

పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాల కు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండి సంతోషంగా జీవనం గడపాలని ఎం పీ డీకే అరుణ అన్నారు. ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా ఎంపీ డీకే అరుణ వేడుకలకు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు, కార్యకర్తలు, భక్తులు ఉన్నారు.