calender_icon.png 17 April, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర కాషాయమైన జగిత్యాల

08-04-2025 12:27:48 AM

 జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా సోమవారం జగిత్యాల పట్టణం కాషాయమయమైంది. దీక్ష స్వాములు, మహిళలు, యువకుల కేరింతలు నృత్యాల మధ్య జై శ్రీరామ్ నినాదాలు మార్మో గాయి.

హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలని శ్రీ శ్రీ కొత్తకోట శివానంద చార్య స్వామీజీ పిలుపునిచ్చారు. సనాతన హిందూ ధర్మానికి అడుగడుగున పొంచి ఉన్న ముప్పును గమనిస్తూ హిందూ బంధువులు ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. దేవాలయ పరిరక్షణ, గో సంరక్షణ, సంస్కృతి పరిరక్షణ ధ్యేయంగా ముందుకు కదలాలని కోరారు.

జగిత్యాల పట్టణంలోని మడేలేశ్వర స్వామి దేవాలయం వద్దగల హనుమాన్ విగ్రహం కు పూజలు నిర్వహించిన అనంతరం బయలుదేరిన శోభాయాత్ర తీన్ ఖనీ చౌరస్తా, టవర్ సర్కిల్, తహసిల్ చౌరస్తా నుండి జంబి గద్దె హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ ప్రాంత ధర్మచార్య శ్రీశ్రీ కొత్తకోట శివానంద స్వామి జీ. ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్, వద్దిపర్తి సంతోషాచార్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, పట్టణ అధ్యక్షులు అరుణ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, బిజెపి సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, లక్ష్మి, సీపెళ్లి రవీందర్, సుధాకర్, శ్రీనివాస్, కొక్కు గంగాధర్, సంతోష్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.