21-02-2025 12:47:57 AM
తిరువీధి సేవతో యాగశాల ప్రవేశం చేసిన స్వామివారు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): స్వస్తిశ్రీ క్రోధానామ సంవత్సర మాఘ బహుళ సప్తమి 19 మంగళవారం నుండి మాఘ బహుళ దశమి ఆదివారం 23 వరకు జరుగుతున్న యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సువర్ణ దివ్య విమాన రాజ గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అత్యంత వైభవంగా శ్రీశ్రీశ్రీ రామానుజాల జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం నాడు స్వామి వారి ఆలయంలో నిత్యారాదన అనంతరం తిరు వీధి సేవ, యాగశాల ప్రవేశము, వేద ఇతిహాసా, పురాణ స్తోత్ర పారాయణము. మూల మంత్ర, మూర్తి మంత్ర, పావనము, నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజన మంత్ర పుష్పము, తీర్థప్రసాద, గోష్టి కార్యక్రమాలను. శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు యజ్ఞాచార్యులు వేద పండితులు పారాయణులు అత్యంత వైభవంగా స్వామివారి సువర్ణ దివ్య విమాన రాజగోపాల మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి ఆలయ నిర్వహణ అధికారి భాస్కరరావు ఉపనిర్వాన అధికారులు పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది వందలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.