13-03-2025 12:00:00 AM
సూర్యాపేట మార్చి 12: పురపాలక పరిధిలోని ఇంటి, నల్లా లకు సంబంధించిన బకాయిలను ఇచ్చిన లక్ష్యం మేర ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వసూలు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదాయ శాఖ తో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, విద్యా సంస్థలు, ఇతర బకాయి దారులు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను వెంటనే చెల్లించాలని, లేదంటే శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
గృహ యజమానులు ఇప్పటి వరకు ఉన్న బకాయిలను తక్షణమే మున్సిపాలిటీ సిబ్బందికి పన్ను చెల్లించాలని, అలా చేయని వారికి మున్సిపల్ జప్తు చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేసి, నల్లా కనెక్షన్ ను శాశ్వతంగా తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్, ఆర్వో కళ్యాణి, ఆర్.ఐ లు పాల్గొన్నారు.