అనూషా కృష్ణ.. పేరుకు కన్నడ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు ఆడపిల్లలా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంటుంది. తె లుగు కూడా స్పష్టంగా మాట్లాడగలదు. గత నెలలో ‘పేక మేడలు’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది అనూషా కృష్ణ. ఆ సినిమా చూసినవాళ్లు నటి అనూష అంటే గుర్తు పడతారో లేదో కానీ, లత్కోర్ లక్ష్మణ్ భార్య అంటే మాత్రం ఠక్కున పేకమేడలు హీరోయిన్ అని చెప్పేస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అనూషా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. “నేను తెలుగులో నటించిన మొదటి సినిమా ఇదే (పేకమేడలు). కన్నడలో నేను నటించిన రెండు సినిమాల్లో నటించాను. నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను. కానీ నా చదు వంతా బెంగళూరు లో సాగింది. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశా. చి న్నప్పట్నుంచీ నటన అంటే ఆసక్తి. నాకు నాటకాలు, నాటికలు వేయడం అంటే ఇష్టం. అందుకే స్టేజీ పర్‌ఫార్మెన్సులు ఇచ్చేదాన్ని.
చదువుకునే రోజుల్లో ‘నువ్వు యాక్టర్‌గా ఎందుకు ప్రయత్నించకూడదు’ అని తెలిసినవాళ్లు అడగ్గా.. అప్పుడు ఆడిషన్స్‌కు హాజరు కావటం ప్రారంభించా. అయితే, నటిస్తాను అని ఇంట్లో చెప్పినప్పుడు ఎవరూ ఒప్పుకోలేదు. వాళ్లతో ఎస్ అనిపిం చుకోవడానికి చాలా కాలమే పట్టింది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం నాకు బాగా నచ్చుతుంది. యా క్టర్‌గా అది నా బాధ్యత. ఓ సినిమా కోసం గిటార్ వా యించడం నేర్చుకున్నా. ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఎప్పు డూ ఒకేచోట ఉంటే బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే తరుచూ ట్రిప్‌లకు వెళ్తుంటా” అని చెప్పింది అనూ ష. సమాజంలో అమ్మాయిల జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా సర్దుకుపోయి బతుకుతున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ, ఇంటిని నడపగలమనే ధైర్యంతో ముందుకెళ్లాలి’ అని సలహా ఇచ్చింది.