calender_icon.png 23 December, 2024 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై అనేకసార్లు లైంగికదాడి

09-09-2024 12:38:11 AM

నిందితుల అరెస్టు

సిద్దిపేట/దుబ్బాక, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు యువకులు అనేకసార్లు లైంగికదాడికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట ఏసీపీ మధు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల బాలిక తీవ్ర ఆనారోగ్యానికి గురవడంతో గ్రామంలోని ప్రైవేట్ వైద్యుల సూచన మేరకు బాలికను తల్లిదండ్రులు సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు బాలిక గర్భవతిగా నిర్ధారించారు.

వైద్యుల సూచనమేరకు బాలిక తల్లి దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాలికను సిద్దిపేటలోని ప్రభుత్వ భరోసా కేంద్రానికి తరలించి విచారించారు. బాలికను పోలీసులు విచారించగా.. దుబ్బాకకు చెందిన ఒక యువకుడు, అక్బర్‌పేట మండలానికి చెందిన ఇద్దరు యువకులు బాలికపై అనేక సార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.