- 24గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
- నిందితుడి అరెస్టు, భరోసా సెంటర్‌కు బాలిక తరలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): నగరంలోని అబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్‌లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ వ్యక్తి చాక్లెట్ ఆశచూపి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించి, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనుములనర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్‌ను బీహార్‌కు చెందిన ఎండీ.
బిలాల్‌గా పోలీసు లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును 24 గంటల్లోనే ఛేదించారు. చిన్నారిని సైఫాబాద్ భరోసా సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు నిందితుడిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధు వులు, స్థానికులు అతడిపై దాడిచేసేందుకు యత్నించగా.. పోలీసులు అతికష్టం మీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు.