calender_icon.png 27 October, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయి అవునంది సారంగో సారంగా..

27-10-2024 12:00:00 AM

ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటిస్తున్న చిత్రమే ‘సారంగపాణి జాత కం’. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాట ‘సారంగో సారంగా’ను మేకర్స్ విడుదల చేశారు.

కథానాయకుడు సారంగపాణి ప్రేమకథ నేపథ్యంలో వచ్చే ఈ పాట అర్మాన్ మాలిక్ గళంలో రామజోగయ్య శాస్త్రి పద చాతుర్యం కొత్త పుంతలు తొక్కినట్టుగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ స్వరాలు ఆకట్టుకుంటున్నాయి.