బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : అసమాన్యమైన ప్రజ్ఞా పాటవాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మేధావి పీవీ నరిసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం పీవీ 103వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారతదేశం ఉన్నన్ని రోజులు పీవీ పేరు దేశ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఆర్ధికంగా అతలాకుతలమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడారని పేర్కొన్నారు. పీవీకి ముందు ఆయన పాలన తరువాత అన్న తీరుగా దేశ ఆర్థిక ముఖ చిత్రం మార్చారన్నారు. ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు గొప్పగా నడిపిన నాయకుడి ఆయన శతజయంతి ఉత్సవాలను బీఆర్ఎస్ తరపున ఘనంగా నిర్వహిం చినట్లు చెప్పారు. ఆయన పేరును ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నెక్లెస్రోడ్డుకు నామకరణం చేశామని, ఘనమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పీవీ జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.