calender_icon.png 11 March, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్ననాటి స్నేహితుల దాతృత్వం

10-03-2025 12:27:58 AM

కుటుంబాల ఆసరాకు రూ.లక్ష సాయం.

తలకొండపల్లి, మార్చి 9 (విజయ క్రాం తి): వారంతా 10వ తరగతి వరకు గ్రామం లోని పాఠశాలలో కలిసి చదువు కున్నారు. అనంతరాం కొందరు ఉన్నత చదువులకు, మరి కొందరు జీవితంలో స్థిరపడేందుకు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. కాలక్రమం లో వారందరు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వీరిలో కొందరు ఇటీవల మృతి చెందారు. మృతుల కుటుంబాలను పరమార్శిండానికి చిన్ననాటి మిత్రులందరు కలిసి ఆదివారం గ్రామానికి చేరుకున్నారు.

వారే 1997 విద్యా  సంవత్సరంలో తలకొండపల్లి మండ లం వెల్జాల్ గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు.తమతో పాటు 10వ తరగతి వరకు చుదువుకున్న మసిగుండ్లపల్లి వెంకటయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదేవిదంగా మరో స్నేహితులైన జి.మల్లేష్, వాజీదాబేగం లు కూడా మృతిచెందారు. చిన్ననాటి స్నేహితులు ఆకాలంగా మృతి చెందడంతో వారి కుటుంబాలను పరమా ర్శించడానికి మిత్రులందరు కలిసి గ్రామానికి చేరుకున్నారు.

మిత్రుల కుటుంబ సభ్యులను పరమార్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.అంతంతమాత్రంగా ఉన్న వారి పరిస్తితులను గమనించిన  మిత్రులు తలో కొంత మొత్తం జమ చేసి వెంకటయ్య కుటుంబానికి రూ.40వేలు, మల్లేష్, వాజీదాబేగం కుటుంబాలకు చెరో రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయంగా అందజే శారు.

తమతో పాటు చదుకున్న  మిత్రులు అర్థాంతరంగా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మిత్రులందరం కలిసి వారికి అండగా నిలవాలని నిర్ణయిం చుకుని ముందుకు వచ్చినట్లు మిత్రులు చెప్పారు.తోటి మిత్రుల కుటుంబాల ఆర్థిక స్థితి గతులను తెలుసుకుని వారి కుటుంబా లకు ఆర్థికంగా ఆసరాగా నిలిచిన మిత్ర  బృందానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియ జేస్తూ అభినందించారు.