calender_icon.png 12 December, 2024 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం

12-12-2024 02:35:56 AM

* ఆరుగురికి గాయాలు

సూర్యాపేట, డిసెంబర్ 11: సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో జంగాలపడిగ ప్రాంతానికి చెందిన కడమంచి శ్రీను పూరిగుడిసెలో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెకు నిప్పంటుకుంది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా పక్కనే ఉన్న మరో గుడిసెకు నిప్పంటు కుంది. ఆ గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో ఒక్కసారిగా పేలిపోయిం ది. ఈ క్రమంలో మంటలార్పుతున్న పర్వ తం సతీష్, కడమంచి నాగయ్య, పర్వతం శ్రీను, ఎలమంచమ్మ, కె.నాగయ్య, పర్వతం మంగమ్మలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సూర్యాపేట దవాఖానకు తరలించారు. నిప్పంటుకున్న సిలిండర్ ఒక్కసారిగా పైకి లేచి పక్కనే ఉన్న నీటి కాల్వలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.