calender_icon.png 4 January, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలలు ఐక్యంగా ఉండాలి

30-12-2024 02:11:20 AM

* ఎమ్మెల్యే వివేక్ 

ఆదిలాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): మాల కులస్థులు ఐక్యంగా ఉండి పోరాడితేనే హక్కులను సాధించగలుగుతారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటసామి అన్నారు. కొందరు తమ సార్థం కోసం దళితులను బలహీన పర్చాలని చూస్తున్నా  ఆయన మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాలల భవిష్యత్ కార్యచరణ, జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ర్టంలో మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారని వారిని పట్టించుకునే అవసరం లేదని వ్యతిరేక వర్గాలవారు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారకు. కొందరు రాజకీయ నాయకులు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజకీయాలు చేశారని, కానీ తానెప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోలేదన్నారు.

మాలలు గ్రామ స్థాయిలో ప్రభుత పథకాలు, ప్రభుత ఉద్యోగాలలో ఎంత మేరకు లబ్ధి పొందారో వివరాలు సేకరించాలని తెలిపారు. వన్ మాన్ కమీషన్ కు మాలలు వ్యక్తిగతంగా వినతులు అందజేసి తమ మెజారిటీని చాటాలని సూచించారు. కార్యక్రమంలో మాల సంక్షేమ సం  జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్, వ్యవస్థాపక అధ్యక్షుడు బేరా దేవన్న, సింగారి అశోక్  పాల్గొన్నారు.