భూపాలపల్లి జిల్లాలో 13 మంది అరెస్టు
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాలను ఘనపురం, కాటారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరుగా 13 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సంపత్‌రావు తెలిపిన వివరాల ప్రకా రం.. గంజాయి రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారంతో ఘనపురం మండలం గొల్లపల్లి వద్ద ఎస్సై అశోక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఒకరు బైక్‌పై మరో ఐదుగురు ఆటోలో అనుమానాదస్పదంగా కనపించారు.
ఆటోను సోదా చేయగా రెండు కిలోల గంజాయి పట్టుబడింది. గం జాయి రవాణా చేస్తున్న వేశాలపల్లికి చెందిన లావుడ్య సిద్దు, కొండాపూర్‌కు చెందిన కీసర సంతోశ్, వెంకటేశ్వర్లపల్లికి చెందిన జనగాం ప్రేమ్‌తేజ్, భూపాలపల్లికి చెందిన మేకల అరుణ్, కడారి సాయికుమార్, మహాముత్తారం మండలం యామన్‌పల్లికి చెందిన కొండగొర్ల రంజిత్‌ను అరెస్ట్ చేశారు. వీరు భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని తక్కువ ధరకు కొని భూపాలపల్లి పరిసర ప్రాంతా ల్లో అమ్ముతున్నారు.
కాటారంలో...
కాటారంలోని ఆదివారంపేట నుంచి గంజాయి తరలిస్తున్న ఏడుగురి ముఠాను ముఠాను కాటారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌చార్జి సీఐ రాంచందర్‌రావు వివరాలు వెల్లడించారు. కాటారానికి చెందిన దుర్గం నందకిశోర్, కడారి కార్తీక్, మారుపాక రిశ్వంత్, మెరిజాల రోహిత్, ఎర్రగుంటపల్లికి చెందిన జక్కు రాజేశ్, బయ్యారానికి చెందిన జగజంపుల విష్ణు, కొత్తపల్లికి చెందిన పెద్ది నిఖిల్‌రాజ్‌కు నంద కిషోర్ గంజాయి ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1.8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.