calender_icon.png 21 January, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్కా ఆట మొదలు కానుంది!

12-08-2024 12:00:00 AM

హీరో వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. కరుణకుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్ మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ పెద్ద వయసున్న వ్యక్తిగా, యువకుడిగా.. రెండు విభిన్న అవతార్‌లలో కనిపిస్తున్నారు. ‘కమాండ్ చేయడానికి, జయించడానికి అతను ఇక్కడ ఉన్నాడు.

మట్కా కింగ్ వాసుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. త్వరలోనే బిగ్‌స్క్రీన్‌పై మట్కా ఆట మొదలు కానుంది’ అనే వ్యాఖ్యలు జోడిస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో చేసిన పోస్టు సినిమాపై అంచనాలు పెంచుతోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో హీరో 24 ఏళ్ల జర్నీని నాలుగు డిఫరెంట్ గెటప్‌లలో చూపించనున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తుండగా నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి.రవి శంకర్ తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా, ఎ.కిషోర్‌కుమార్ డీవోపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు.