ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారుల చిరునామాలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలె.తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ బోర్డులను, సిటిజన్ చార్టర్‌లను అమర్చాలి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో అధికంగా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వారి చిరునామా వివ రాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల మరింతమం ది అవినీతి అధికారులు పట్టుబడే అవకాశం ఉంది. ప్రభుత్వ యం త్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి చట్టాలను బలోపేతం చేయాలి. ఏసీబీ అధికారుల వివరాలు చాలామంది సామాన్య ప్రజానీకానికి తెతలియదు. ఈ రకంగా ఏసీబీ అధికారుల చిరునామా, సెల్ నంబర్లను ప్రజలు తెలుసుకోవడంతోపాటు అవినీతి, అక్రమాలపై వెనువెంటనే ఫిర్యాదులు చేసే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లోనూ లంచం తీసుకోవడానికి భయం పడే వాతావరణం కూడా ఏర్పడుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి ముందుకు రావాలి.
వావిలాల రాజశేఖర్‌శర్మ, నాగర్‌కర్నూల్