రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల ఎప్పుడా అని తెలుగు వారంతా ఎదురుచూస్తున్నారు. అటు అభిమానులు కూడా‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్ చేయనున్న సినిమా కోసం రెండేళ్ల నుంచి పడిగాపులు కాస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఈ సినిమా పనులు మొదలైనా శంకర్ చేయాల్సిన ‘భారతీయుడు 2’ మధ్యలో రావడం వంటి కారణాలతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ‘గేమ్ చేంజర్’ ఈ సంవత్సరమైనా చూస్తామా అన్న సందేహం తలెత్తుతున్న తరుణంలో ‘భారతీయుడు 2’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న శంకర్ దీనిపై స్పందించారు.
‘గేమ్ చేంజర్’ విడుదల ఎప్పుడన్న పాత్రికేయుల ప్రశ్నకు బదులుగా ‘రామ్ చరణ్‌కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. మరో పదిహేను రోజుల చిత్రీకరణతో సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుంది’ అన్న ఆయన, ‘ఎడిటింగ్ పూర్తయితే తప్ప విడుదల తేదీని ప్రకటించలేం’ అ సమాధానమిచ్చారు. మరోవైపు ఇప్పటికే 2024 ద్వితీయార్ధం తమదే అని తెలుగుతోపాటు పలు తమిళ చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖాయం చేసుకుని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘గేమ్ చేంజర్’ రాక ఈ ఏడాదిలోనా..? లేక 2025 లోనా..? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘గేమ్ మారబోతుంది’ అంటూ తమ అధికారిక ఖాతా ద్వారా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీమ్.