calender_icon.png 16 January, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్ ఛేంజర్ అనుకున్నట్టు రాలేదు

16-01-2025 01:47:18 AM

‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించారు. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శంకర్ ఆసక్తికర కామెం ట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ అవుట్‌పుట్‌తో తాను సంతృప్తిగా లేనని వ్యాఖ్యానించారు. “గేమ్ ఛేంజర్’ అవుట్‌పుట్‌తో సంతృప్తిగా లేను.

వాస్తవానికి ముందుగా నేను అను కున్న దాని ప్రకారమైతే సినిమా నిడివి 5 గంటల వరకూ ఉండాలి కానీ సమయం అనుకున్నంత లేకపోవడంతో కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దీంతో నేను అనుకున్న విధంగా కథ రాలేదు. నేను ఇప్పటి వరకూ ఆన్‌లైన్ రివ్యూలు చూడలేదు” అని శంకర్ తెలిపారు. రామ్‌చరణ్, ఎస్‌జే సూర్యల నటనపై ఆయ న ప్రశంసలు కురిపించారు. అయితే శంకర్ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.