11-04-2025 12:42:31 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, ఏప్రిల్ 10(విజయక్రాంతి):కృత్రిమ మేథా (ఏఐ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో హత్నూర అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు కంప్యూటర్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు కృత్తిమ మేథాతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
జిల్లాలో కృత్రిమ మేధ ఆధారిత విద్యాబోధనను అన్ని పాఠశాలలలో ప్రారంభించాలనే ఉద్దేశంతో జిల్లాలోని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా గల 15 పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో ఏఐ విస్తరింపజేసే క్రమంలో ప్రత్యేకంగా వారికి కంప్యూటర్లను అందజేయడం జరిగిందన్నారు.
ఇదివరకే జిల్లాలో కృత్రిమ మేధ ఆధారిత కార్యక్రమాన్ని 33 పాఠశాలల్లో మార్చి 15న ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా జూనియర్ కళాశాల విభాగంలో అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ హత్నూరకు 10 కంప్యూటర్లు అందజేసి అక్కడ జేఈఈ మెయిన్స్, ఎంసెట్ కోచింగ్ పూర్తి స్థాయిలో నిర్వహించేలా ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు, అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులుపాల్గొన్నారు.