హీరో సిద్ధార్థ్ కాబోయే శ్రీమతికి కోపమొచ్చింది. సిద్ధార్థ్‌తో కొంతకాలం ప్రేమాయణం సాగించిన అది తీ రావు హైదరీ కాబోయే శ్రీవారితో నిశ్చితా ర్థం కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ముంబయిలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహ వేడుకలో ఈ కాబోయే వధూవరులు ఒక రి చేతిలో మరొకరు చెయ్యేసి నడిచి వచ్చి సందడి చేశారు కూడా. ఈ సందర్భంగా అదితీ రావు హైదరీ ఎంతో హుషారుగా కనిపించింది. ఇదిలా ఉండగా, ఈ అమ్మడుకి ఇంగ్లండ్‌లో చేదు అనుభవం ఎదురైంది.
ఆ దేశంలోని హిత్రో ఎయిర్‌పోర్టులో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందట ఈ ముద్దుగుమ్మ. అందుకే ‘ఇదొక చెత్త ఎయిర్పోర్ట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా కోపాన్ని వెల్లగక్కిందీ భామ. అటు ఎయిర్పోర్ట్ సిబ్బందిపైనా రుసరుసలాడిందీ సొగసరి. ‘అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది నాకు సహాయం చేయాల్సింది పోయి.. లగేజీ కోసం ఎయిర్ లైన్ సంస్థను సంప్రదించాలని సలహా ఇచ్చారు’ అంటూ ట్విట్టిపోసింది. దాదాపు ఆరు గంటలకు పైగా వేచి ఉన్న తర్వాత గానీ తనకు లగేజీ అందలేదని అసహనం వెళ్లగక్కింది హైదరీ.
ఇటీవలే ‘హీరామండి : ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన అదితీ రావు.. ‘లయనెస్’, ‘గాంధీ టాక్స్’ చిత్రాల్లో కనిపించనున్నది. అయితే అదితీ రాబో యే చిత్రాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటికైతే రాలేదు.