calender_icon.png 7 January, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతి భవిష్యత్తే ముఖ్యం

06-01-2025 01:02:32 AM

* ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

* గజ్వేల్‌లో మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం

గజ్వేల్, జనవరి 5: ఎస్సీ వర్గీకరణ కోసం 30ఏండ్లుగా పోరాడుతున్నామని.. మాకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతి భవిష్యత్తే ముఖ్యమని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయసమ్మేళనంలో ప్రొఫెసర్ కాశీం, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు ఆయన పాల్గొని మాట్లాడారు.

వర్గీకరణ జరగకుండా ఉండేందుకు పలుకుబడితో కొన్ని శక్తులు అడ్డుపడు  అయితే ప్రధాని నరేంద్రమోదీ వర్గీకరణకు అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి మాదిగల శక్తి తెలిపేలా హైదరాబాద్‌ను వేల గొంతులు, లక్ష డప్పులతో ముట్టడించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివమాదిగ, ఎమ్మార్పీఎస్ కళామండలి జాతీయ అధ్యక్షుడు ఎన్‌వై అశోక్, వేయి గొంతులు, లక్షడప్పుల కమిటీ కన్వీనర్ ఏపూరి సోమన్న, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.