calender_icon.png 3 March, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భవిష్యత్తు సాంకేతిక ఆవిష్కరణలు పురోగతిపై ఉంది

02-03-2025 08:11:17 PM

పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలో ఐఐటి హైదరాబాద్ అగ్రమికంగా ఉంది.. 

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్..

సంగారెడ్డి (విజయక్రాంతి): భారత్ కంపెనీలు గ్లోబల్ లీడర్లతో పోటీ పడాలని, సాంకేతిక ఆవిష్కరణల పురోగతి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కీలకంగా ఉంటుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Vice President of India Jagdeep Dhankhar) తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని కంది సమీపంలో ఉన్న ఐఐటి హైదరాబాద్(IIT Hyderabad) లో జరిగిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఐఐటి హైదరాబాద్ ఆలోచనలు ఆవిష్కరణల సాధనలో అగ్రమికంగా నిలిచిందని ప్రశంసించారు. ఐఐటి హైదరాబాద్ సాంకేతిక పురోగతికి చేసిన గొప్ప కృషిని భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దడంలో ఎంతో పాత్ర ఉంటుందని తెలిపారు. ఐఐటీలో 300 మంది ప్రతిభవంతులు అధ్యాపకులుగా పనిచేయడం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాలు అవసరమైన వాటిని సమకూర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆధ్యాపకులు విజయాలను సాధించేందుకు అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు.

భవిష్యత్తు ఆవిష్కరణలు విద్యార్థుల మనసులపై చిరస్థాయిగా ప్రభావం చూపిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు సృజనాత్మకమైన నవీనమైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేయాలి అన్నారు. ఐఐటి విద్యార్థులతో పలు విషయాలపై మాట్లాడి తెలుసుకున్నారు. నవీకరణ ఆర్థిక జాతీయత సాంకేతికత న్యాయకత్వంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ(Telangana State Governor Jishnu Dev Sharma), ఉపరాష్ట్రపతి సతీమణి సుదేశ్ ధన్కర్, ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ చెన్నూరు రూపేష్, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు