calender_icon.png 6 February, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు

06-02-2025 12:41:25 AM

*-విద్యార్థులు వేసే ప్రతి అడుగులో ఎదుగుదల ఉండాలి 

* -అభివృద్ధికి కంకణబద్ధులమై పనిచేస్తున్నాం 

* అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 5 ( విజయ క్రాంతి) : మీరు చదివే చదువు కేవలం మీ భవిష్యత్తు కోసమే కాదని దేశ భవిష్యత్తు  మీ చేతుల్లో ఉందనే విషయాన్ని స్మరించుకుం టూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీని వాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో నిర్వహిం చిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక కార్యక్ర మాలకు, రెయిన్బో స్కూల్, చైతన్య స్కూల్, శ్రీ అక్షర, క్రీస్తు జ్యోతి, గెలాక్సీ పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు  2 డి, 3d  అనిమేషన్‌తో కూ డిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందిం చడంతోపాటు,సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్యాకెట్ డైరీ ఆవిష్కరణలో, బాలికల జూని యర్ కళాశాలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహం (బి), కోయిలకొండ ఎక్స్ రోడ్ దగ్గర శ్రీ రామాంజనేయ దేవాలయం దగ్గర  ము డా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  కవిగా, కళాకారుడిగా, మహా వాగ్గేయకారు డిగా అంతకుమించి  జీవితమంతా కష్టజీవు ల  కోసం  అంకితం చేసిన వ్యక్తి సుద్దాల హనుమంతు ఆదర్శంగా తీసుకుని ముందు కు సాగాలని సూచించారు. విద్యార్థులు పట్టుదల ఎట్టి పరిస్థితుల్లో వీడకుండా లక్ష్యా న్ని చేరుకునేలా విద్యనుభ్యసించాలని సూ చించారు.

ఇప్పుడు ఇలాంటి సహకారాలు కావలసి ఉన్న అందుబాటులోకి తీసుకొచ్చేం దుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో నమీబియా దేశ పు పూర్వపు మాజీ మంత్రి బెర్నార్డ్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, బెక్కెం జనార్థన్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డాక్టర్ జె. రాంమోహన్, జగపతి రావు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.