మాజీమంత్రి కొప్పుల
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల మరణా ల ఘటన మరువక ముందే ఉద్యోగు ల ఎంపికలో అవినీతి దందా బయటపడిందన్నారు. ఒక్కో అభ్యర్థికి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డా రు. పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ పేరు తో పాతవారిని తీసేస్తారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్ వల్ల 38 ప్రతిభా పాఠశాలలు, 24 క్రీడా అకాడమీలు, మూజి క్ స్కూల్, సైనిక్ స్కూల్, మహిళా సైనిక్ స్కూల్, న్యాయ కళాశాల లాంటివి మూతపడే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ౬ నెలల ముందే విద్యార్థులకు అన్నీ వస్తువులను ఇచ్చే వారని, కానీ ఇప్పుడు పాఠశాల మొదలై 3 నెలలైనా పిల్లలకు ఇప్ప టికీ యూనిఫామ్స్ ఇవ్వలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు.