calender_icon.png 10 March, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుర భవితవ్యం మన చేతుల్లోనే!

21-02-2025 12:00:00 AM

దేశవ్యాప్తంగా అబ్బాయిలు చదువులలో వెనుకబడటం, క్రమశిక్షణా రాహిత్యంగా మారటం, బాల నేరస్తుల సంఖ్య అధికం కావడం, వారిలో మత్తు పదార్థాల వినియోగం పెరగడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నుంచి అబ్బాయిలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం మనం ‘బేటి బచావో, బేటి పడావో’ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటు న్నాం. 2015 జనవరి 22న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల లింగనిష్పత్తిని కాపాడటం, వారిని విద్యకు చేరువ చేయటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. గత దశాబ్ద కాలంగా కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలవల్ల  2014 నుంచి 2024 వరకు బాలికల స్థితిగతులు చాలా మారాయి.

లింగ నిష్ప త్తి 914 నుండి 930కి పెరిగింది. బాలికల ఎన్‌రోల్‌మెంట్ 75.51 శాతం నుంచి 78 శాతానికి పెరిగింది. బాలికల విద్యపట్ల తల్లిదండ్రులు, సమాజం అధిక శ్రద్ధ వహించ డం పెరిగింది. భ్రూణహత్యలు తగ్గాయి. బాలికలు విద్యా, ఉపాధి రంగాలలో ముం దంజలో ఉంటున్నారు. ఇది మనందరం హర్షించదగిన విషయం.

అదే సమయం లో దేశవ్యాప్తంగా అబ్బాయిలు చదువుల లో వెనుకబడటం, క్రమశిక్షణా రాహిత్యం గా మారటం, బాల నేరస్తుల సంఖ్య అధి కం కావడం, వారిలో మత్తు పదార్థాల వినియోగం పెరగడం వంటివి ఆందోళన కలి గిస్తున్నాయి. వీటన్నిటి నుంచి అబ్బాయిలను రక్షించుకోవడం, వారూ చదువుల పట్ల శ్రద్ధ వహించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.

పెరుగుతున్న అంతరం

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు చదువులలో వెనుకబడుతున్నారని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. ‘2024 యునె స్కో’ నివేదిక ప్రకారం, తరగతికి సంబంధించిన లక్ష్యాల సాధనలో బాలికలకు బాలురకు మధ్య చాలా అంతరం ఉంటున్నది. ఇండియా, శ్రీలంక, మలేసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలుర ఎన్‌రోల్‌మెంట్, అభ్యాస ఫలితా ల సాధన, ఉత్తీర్ణత తగ్గుతున్నాయి.

ఈ దేశాలలో బాలికలు బాలుర మధ్య ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి 114: 100గా ఉండ టం గమనార్హం. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలోనూ ఇలాంటి గణాంకాలే గతంలో గుర్తించారు. బాలికలతో పోలిస్తే బాలుర డ్రాపౌట్ రేటుకూడా ఎక్కువగానే ఉంటున్నది. ‘చిల్డ్రన్ ఫస్ట్’ సంస్థ జరిపిన సర్వే ప్రకారం, వార్షిక పరీక్షలలో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించిన వారి శాతం బాలికల్లో 26.7 ఉండగా బాలుర లో 19.1 మాత్రమే ఉంది.

63 శాతం బాలికలు భాషా నైపుణ్యాలు సాధిస్తుండగా, బాలలలో కేవలం 56 శాతం మాత్రమే సాధిస్తున్నారు. గణిత నైపుణ్యాలలో బాలబాలికల మధ్య పెద్దగా అంతరం లేదు. ఉన్నత విద్యాసంస్థలలో బాలుర సంఖ్య గణనీయంగా తగ్గింది. మేనేజ్‌మెంట్, మెడిసిన్, లా వంటి కోర్సులలో బాలబాలికల నిష్పత్తి 43: 57గా నమోదైంది. ఇంజినీరింగ్ విద్యలో మాత్రం బాలురు అధికసంఖ్యలో ఉన్నారు. 

వెనుకంజలో అబ్బాయిలు

భారతదేశంలో గతంలో బాలికా విద్య కు ప్రాముఖ్యత తక్కువగా ఉండేది. కానీ, ప్రస్తుతం బాలికలు అంది వచ్చిన అవకాశాలతో ముందుకు సాగుతుండగా, బాలు రు దుర్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ అంధకారం చేసుకుంటున్నారు. చదువులలో బాలురు వెనుకబడేందుకు పేదరికం ఒక ప్రధాన కారణంగా పేర్కొనాలి. గృహావసరాలు తీర్చేందుకు బాలురు వివిధ వృత్తులలో నిమగ్నం అవుతారు.

దానివల్ల బడి హాజరు శాతం తక్కువగా ఉండటం, దీర్ఘకాలికంగా పాఠశాలలకు హాజరు కాకపోవడం వల్ల బోధనాంశాలు అర్థంకాక అభ్యాస లక్ష్యాలు సాధించలేక పోతున్నా రు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడ మూ మరో ప్రధాన కారణం. బాలికలపట్ల అమిత శ్రద్ధ, జాగ్రత్తలు వహించే తల్లిదండ్రులు బాలుర పెంపకంలో అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. బాలురకు అధిక స్వేచ్ఛ ఇవ్వడం మన సమాజంలో అనాదిగా ఉన్న లక్షణం.

వైద్య నిపుణుల అభిప్రాయం మేరకు, బాలబాలికల మధ్య ఉండే న్యూరోలాజిక ల్, హార్మోనల్ తేడాలు కూడా బాలికలకన్నా బాలురు అభ్యసనలో వెనుకబడేం దుకు కారణమవుతున్నది. ఇంద్రియ, అభి జ్ఞ వికాసం బాలికలలో ఎక్కువగా ఉంటుం ది. దీనివల్ల బాలికల్లో చూపు, వినికిడి, జ్ఞాపక శక్తి, వాసన, స్పర్శ శక్తి ఎక్కువగా ఉంటాయి. పాఠశాల ప్రారంభించే సమయానికి అబ్బాయిలతో పోలిస్తే బాలికలు పాఠశాల కోసం ఎక్కువ సంసిద్ధతను ప్రదర్శిస్తారు.

బాల్యంలోని ఈ వ్యత్యాసాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల వైఖరిని  ప్రభావితం చేయవచ్చు. సామాజిక కారణాలు కూడా బాలురు విద్యలో వెనకబడేందుకు కారణాలుగా పేర్కొనవ చ్చు. మొండితనం, నిర్లక్ష్యం, అల్లరి చేయ టం ఇవన్నీ బాలుర సహజ లక్షణాలుగా భావిస్తూ, పైగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాటిని సరిదిద్దే ప్రయత్నమూ చేయడం లేదు. 

బాబోయ్.. మగపిల్లలు!

బాలికలతో పోలిస్తే అధిక శాతం బాలురకు మొబైల్స్ అందుబాటులో ఉంటున్నా యి. ‘2023 అసర్’ నివేదిక ప్రకారం, 14 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో 56 శాతం బాలురు మొబైల్స్ కలిగి ఉండగా కేవలం 20 శాతం బాలికలకు మాత్రమే మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయి. బాలురు సోషల్ మీడియా, గేమ్స్‌లో ఎక్కువ సమయం వినియోగిస్తూ చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. క్లాస్‌రూమ్‌లో ఏకాగ్రతను కోల్పోతున్నారు. మొబైల్ కారణంగా భావోద్వేగ నియంత్రణ కోల్పోతు న్నారు. లైంగిక నేరాలకు పాల్పడుతున్న దుర్ఘటనలూ చూస్తున్నాం.

సహచరుల ప్రభావం బాలురపై ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదం డ్రుల ఆదేశాలు, సూచనలు పాటించడాన్ని బాలురు నామోషీగా భావిస్తారు. అలా పాటించే బాలురను తోటివారు హేళన చేస్తారు. ఆదేశాలు ఉల్లంఘించడం, క్రమశిక్షణా రాహిత్యంతో ఉండటం ఘనమైన అంశంగా బాలురు భావిస్తారు. గత కొంతకాలంగా బడీడు పిల్లల్లో మత్తు పదార్థాల వినియోగం పెరిగింది.

వీరిలో అధిక శాతం బాలురే ఉన్నట్టు జాతీయ స్థాయి అధ్యయనంలో తేలింది. మత్తు పదార్థాల వినియోగానికి అలవాటైన పిల్లలు విద్యలో వెను కంజ వేస్తారు. క్రమశిక్షణా రాహిత్యం కనబరుస్తారు. నేర కార్యకలాపాల్లో పాలుపం చుకుంటారు. ప్రేమ పేరుతో ఆకర్షణకు గురై తమ ముందున్న తక్షణ కర్తవ్యాన్ని మరువడం బాలురలలో గమనించవచ్చు.

ఈ విధంగా అనేక కారణాలతో బాలు రు విద్యలో వెనకబడటమే కాక దుర్వ్యసనాలు అలవర్చుకుంటున్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే సమా జం పెనుముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత, సామాజిక భాధ్యత. కనుక, తల్లిదండ్రులు బాలురపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వారిపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు బాలురకు కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించి మత్తు పదార్థాలు, మొబైల్ అధిక వినియోగం వల్ల కలిగే అనర్థాలు వివరించాలి. క్రమశిక్షణా రాహిత్యం వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తెలియచేయాలి.

ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిలర్స్‌ను నియమించి బాలబాలికల మానసిక సమస్యలను, ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు పరిష్క రించాలి. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.  ఆరోగ్యకరమైన అలవా ట్లు అలవర్చుకునే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలి. మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మనందరి కర్తవ్యం.బాలికలతోపాటు బాలురు కూడా విద్యావంతులైనపుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమవుతుంది.

 డా.అనుమాండ్ల వేణుగోపాలరెడ్డి

9948106198