calender_icon.png 10 January, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధంలో కాదు..బుద్ధుడి బోధనల్లో భవిష్యత్తు

10-01-2025 01:33:21 AM

* ఒడిశాకు అనాదిగా సాంస్కృతిక వారసత్వం

* ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

* భువనేశ్వర్‌లో అట్టహాసంగా వేడుక 

భువనేశ్వర్, జనవరి 9: మానవాళి భవిష్యత్తు బుద్ధుడి శాంతి బోధనల్లో ఉందని, యుద్ధంలో కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం నిర్వహించిన 18వ ప్రవాస భారతీయ దివస్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మానవాళి యుద్ధమార్గంలో కాకుండా, శాంతిమా ర్గంలో పయనించాలని ఆకాంక్షించారు.

ప్రపం చ దేశాలన్నీ కత్తులు దూసుకుంటున్న సమయంలో సామ్రాట్ అశోక ఒడిశాలో శాంతిమా ర్గాన్ని ఎంచుకున్నారని గుర్తుచేశారు. ఒడిశాలో అడుగడుగునా ముందు తరాల వారసత్వం కనిపిస్తున్నదని, ఉదయగిరి, ఖండగిరి గుహలు, కోణార్క్ దేవాలయమే అందుకు నిదర్శనమన్నారు.

శతాబ్దాల క్రితమే ఒడిశాకు చెందిన వ్యాపారులు ఇండోనేషియాకు వెళ్లి వ్యాపారం చేసేవారని కొనియాడారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదే కాదని, జీవితాల్లో భాగమని అభివర్ణించారు. వీదేశాల్లో జీవించేవారిని తాను భారత్‌కు రాయబారులుగా చూస్తానని వెల్లడించారు. 

‘విశ్వబంధు’ పేరు నిలపాలి..

భారత యువతను పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. జీ20 సందర్భం గా దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహించామని, తద్వారా భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామనివివరించారు.

భారత వారసత్వ, విభిన్న సంస్కృతులను యావత్ ప్రపం చం గమనిస్తున్నదని, అంతగొప్ప వారసత్వం భారత్‌కు ఉందని కొనియాడారు. వచ్చే ప్రవా సీ భా రతీయ దివస్‌కు ఒక్కొక్కరూ ఐదుగురు విదేశీ మిత్రులను వెంట తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారత్‌కు ఇప్పటికే విశ్వబంధు అనే గు ర్తింపు ఉందని, ఆ పేరును శాశ్వతంగా పదిలపరచాలని సూచించారు.

పవిత్ర మహాకుం భ్, సంక్రాంతి, లొహిర్, మాగ్ బిహు వంటి పండుగల సీజన్‌లో ప్రవాసీ భారతీయ దివస్ జరగ డం ఆనందాన్నిచ్చిందన్నారు. భారత్ ఇ ప్పటికే పునరుతాత్పదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, మెట్రో నెట్‌వర్క్, బుల్లెట్ రైలు ప్రాజెక్టుల స్థాపనలో విజయం సాధించిందని హర్షం వ్యక్తం చే శారు.

‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఫైటర్ జెట్, టాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలోనూ భారత్ దూసుకుపోతున్నదని తెలిపా రు. భవిష్యత్తులో ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే వారు కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఫ్లుట్లైలో వస్తారని ప్రధాని చమత్కరించారు.

స్వతంత్ర సమరంలో ప్రవాసుల పాత్ర..

భారత స్వతంత్ర సమరంలో ప్రవాసులు సైతం ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంలో ప్రవాసులూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అనంతరం వర్చువల్‌గా ప్రవాసీ తీర్థ దర్శన్ పథకంలో భాగంగా ప్రత్యేక రైలును ప్రారంభించారు.  వేడుకల్లో కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు.