calender_icon.png 24 January, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఫ్యూచర్ ఈజ్ హియర్ సదస్సు

24-01-2025 01:53:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎల్వీప్రసా ద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లోని సెంటర్ ఫర్ ఆక్యూలర్ రీజెనరేషన్(కోర్) ఆధ్వర్యంలో బ్రైన్ మోల్డెన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధనా బృందా లు ‘ఫ్యూచర్ ఈజ్ హియర్’ సదస్సు రెండో ఎడిషన్‌ను నిర్వహించాయి.

ఈ సదస్సుకు అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల తో పాటు భారత్‌లోని ఐఐటీలు, సీఎస్‌ఐఆర్‌లు, కేంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 31 సంస్థల నుంచి 200 మందికి పైగా శాస్త్రవేత్తలు, డిగ్రీ విద్యార్థులు, ఇంజినీర్లు, ఆప్తాల్మాజిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్ సీనియర్ సైంటిస్ట్, సదస్సు నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ వివేక్‌సింగ్ మాట్లాడుతూ ఈ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా కంటి అనుబంధ సాంకేతికతలపై పని చేస్తున్న మేధావులను ఒకచోటకు తీసుకొచ్చిందన్నారు.

ఈ ఈవెంట్‌లో ప్రదర్శించిన పరిశోధనలు, ఆలోచనలు భవిష్యత్‌కు మార్గదర్శకం కానున్నాయని తెలిపారు. అమెరి కాలోని నేషనల్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కపిల్ భార్థి, జర్మనీలోని పీయస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ స్టెఫన్ శ్రేడర్ తమ దేశంలోని అవకాశాలను సదస్సులో వివరించారు. ఎల్వీ ప్రసాద్ పూర్వ విద్యార్థి డాక్టర్ వీరేందర్ సంగ్వాన్, బీ గీతావెముగంటి, ప్రముఖ వైద్యులు చక్రవర్తి పాల్గొన్నారు.