calender_icon.png 9 February, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే!

09-02-2025 12:54:10 AM

అధికారంలోకి రాగానే ముస్లిం బీసీ పదాన్ని తొలగిస్తాం 

  1. మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాలి 
  2. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి 
  3. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవే ర్చకుండా తెలంగాణలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్ లో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిప డ్డారు.

హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని విడగొట్టడమే మీ ఆదర్శమా..? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ని నిలదీశారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుడు ముస్లిం బీసీ అనే పదాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు. 

మెదక్-ఆదిలాబాద్- కరీంనగర్- నిజామాబాద్ టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచ ర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు.

కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేలా ఉదృత ప్రచారం చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏసీ విషయంలో ప్రభు త్వం విఫలమైందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించేలా చూడాలన్నారు.

ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీకి అద్భుత విజయం అందిచిన ఢిల్లీ ప్రజలకు తెలంగాణ బీజేపీ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

దక్షిణ భారత దేశంలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, వచ్చే ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు హాజరయ్యారు.