18-02-2025 01:29:14 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ బీసీల దేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తాయా..? అని సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాల్‌లో జరిగిన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీసీలకు 42శా తం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తామన్నారు. ఆ బిల్లును 9 వ షెడ్యూల్‌లో చేర్చడం కోసం ప్రధాని మోదీని ఒప్పిం చే దమ్ముందా? దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వ హించాలని మోదీని అడిగి సత్తా ఉందా..? అని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.
కులగణనతో బీసీలకు కొత్త అధ్యాయం మొదలైందన్నారు. బీసీ నాయకుడిని సీఎం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, భవిష్యత్‌లో బీసీ సీఎం అవుతారన్నారు. ఈ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డినే కొనసాగుతారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యముంటుందన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.
తెలంగాణ కులగణన గేమ్‌ఛేంజర్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి నిర్దేశం అవుతుందని, ఇది గేమ్ చేంజర్‌గా మారు తుందని ఏఐసీసీ ఓబీసీ డిపార్ట్‌మెం ట్ చైర్మన్ అజయ్‌సింగ్ యాదవ్ కొనియాడారు. కులగణన అనేది సమాజం సిటీ స్కాన్ అని తెలిపారు. పీసీసీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో ఆయ న మాట్లాడారు.. క్రిమిలేయర్ నిబంధన రూ.8లక్షల నుంచి రూ.12 లక్ష ల వరకు పెంచాలని డిమాండ్ చేశా రు.
50 శాతం రిజర్వేషన్ సీలింగ్ నిబంధనను ఈడబ్ల్యూఎస్ 10 శా తం రిజర్వేషన్లతో అతిక్రమించారని వివరించారు. ఈవీఎంలు బ్యాన్ అ నే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్ని కలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓబీసీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.
ఏఐసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ చైర్మన్
అజయ్‌సింగ్‌యాదవ్