calender_icon.png 25 October, 2024 | 10:52 AM

అభివృద్ధి ఫలాలు అర్హులందరికీ అందాలి

25-10-2024 01:30:41 AM

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

సూర్యాపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : అర్హులందరికీ ప్రభుత్వం అందజేసే అభివృద్ధి ఫలాలు అందాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందన్నారు.

భవిష్యత్తు అంతా మహిళా సాధికారతపై ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తద్వారా వికసిత్ భారత్ సాధ్యమవుతున్నారు.  జిల్లాలో వైద్య, ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయన్నారు.  మంత్రి ఉత్తమ్‌కూమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఐటీ, సాఫ్ట్‌వేర్, ఫార్మా, సైన్స్ రంగాలలో దేశంలోనే కాకుండా ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టును కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలలో  సహకారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.  నీటిపారుదలశాఖ  మంత్రి ఉత్తమ్‌కూమార్‌రెడ్డి,  ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్,  గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

పత్తి రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు. గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలెక్టరేట్ లో మార్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. 

భధ్రాచలం చేరుకొన్న గవర్నర్

 భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24(విజయక్రాంతి):  రాష్ట్ర గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ గురువారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని సారపాక ఐటీతసీ గెస్ట్‌హౌస్‌కు చురుకొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జిల్లాకు వచ్చారు.

గవర్నర్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ  రాహూల్, ఎస్పీ రోహిత్‌రాజు , భద్రాచలం ఈఓ రమాదేవి స్వాగతం పలికారు. తొలుత గవర్నర్‌కు పోలీస్ గౌరవ వందనం చేశారు.  ఆయన రాత్రికి గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకొని ఉదయం భధ్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించు కొంటారు. అక్కడి నుంచి నేరుగా  జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది.