calender_icon.png 30 September, 2024 | 8:56 AM

స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ మోసం

30-09-2024 12:08:12 AM

ప్రభుత్వ ఉద్యోగికి గాలం

రూ.21.67 లక్షలు లూటీ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. డబ్బు కొల్లగొట్టేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అమాయకుల ఆశలను అదు నుగా తీసుకుని వారిని మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు.

బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును లూటీ చేస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇదే కోవ లో సైబర్ నేరగాళ్లకు చిక్కాడు. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.21.67 లక్ష లు పోగొట్టుకున్నాడు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(48) ఇటీవల తన ప్రమే యం లేకుండానే ‘ఐబీకేఆర్ స్టాక్ ఆకాడమీ అండ్ జీ3 వెల్త్ డ్రీం ఎస్‌ఐజీ గ్రూప్’ పేరు గల వాట్సప్ గ్రూప్‌లో యాడ్ అయ్యా డు.

స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ప్రొఫెషనల్స్‌తో అవగాహన కల్పిస్తామని అడ్మిన్లు సందేశాలు పోస్ట్ చేస్తుండడంతో ఆయన ఆకర్షితుడయ్యాడు. అలా అడ్మిన్లు ప్రభుత్వ ఉద్యో గితో పెట్టుబడులు పెట్టేలా చేశారు. మొదట్లో ఉద్యోగికి బాగానే లాభాలు వచ్చాయి. వచ్చిన లాభాలను సైతం ఉద్యోగి తిరిగి పెట్టుబడులు పెట్ట డం ప్రారంభించాడు. అలా  రూ.21.67 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత వాట్సాప్ గ్రూప్, అడ్మిన్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేశాడు.