calender_icon.png 26 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో రోజూ నష్టాలే

22-02-2025 12:00:00 AM

22,800 దిగువకు నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ముఖ్యంగా ఆటో స్టాక్స్‌లో విక్రయాల కారణంగా శుక్రవారం సూచీలపై ఒత్తిడి పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా 6 శాతం, టాటా మోటార్స్ షేర్లు 2.46 శాతం నష్టపోయాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 4 రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 22,800 దిగువకు చేరింది.

మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అటు ప్రపంచ మార్కెట్లలోనూ వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఉదయం 75,612.61 పాయింట్ల వద్ద  నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 75,112.41 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకి, చివరికి 424.90 పాయింట్ల నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది.