calender_icon.png 3 April, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యంలో వేసే పునాదులే భవిష్యత్తు

02-04-2025 12:27:04 AM

హిడెన్ స్టార్ విద్యాసంస్థ అధినేత్రి ఎస్ హేమలత 

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): బాల్యంలో వేసే పునాదులు భవిష్యత్తును నిర్ణయిస్తాయని హిడెన్ స్టార్ విద్యా సంస్థ అధినేత్రి ఎస్ హేమలత తెలిపారు. మంగళవారం తన పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆటపాటలు లేని నిర్బంధ చదువు పిల్లలను ఒత్తిడికి గురి చేస్తుందన్నారు.

ఫ్రీ ప్రైమరీ దశలోనే చదువుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యాలకు పదును పెట్టే కొత్త పద్ధతిని తమ హిడెన్ స్టార్ విద్యాసంస్థ ప్రవేశపెట్టిందన్నారు. చిన్నారులకు మూడేండ్ల వయసు నుంచే కథలు, జంతువులు, పక్షులను ఉదాహరణగా తీసుకొని నీతి కథలు చెపుతామన్నారు.

ఎనిమిదేళ్లు వచ్చేసరికి దేశ భక్తులు, శాస్త్రవేత్తలు, సాహస వీరుల కథలు, వేమన శతకం, సుభాషితాలు, తల్లి దండ్రులు, పెద్దలు పట్ల గౌరవం పెంచే కథలు చెపుతామన్నారు. ప్రతిరోజూ వారి పనులు వారే చేసుకునేటట్లు శిక్షణ ఇస్తున్నామన్నారు. వారి భాషా ఉచ్ఛారణలో దోషాలు సవరిస్తూ రోజూ ఒక అరగంట తెలుగు, ఇంగ్లీషు చేతిరాత నేర్పించి వేళకు భోజనం అలవాటు చేయటం తమ ప్రక్రియ అని తెలిపారు.