calender_icon.png 3 February, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం శంకుస్థాపన

03-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మల్కాపూర్ లోని శ్రీలక్ష్మీ ెమ్స్ లో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మయూరగిరి పీఠాధిపతి, జ్యోతిష, వాస్తు, ఆగమశాస్త్ర పండితుడు నమిలకొండ రమణాచారి స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తుల హనుమాన్ చాలీసా పారాయణం, రామనామంతో, భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. సకల దోషాలు తొలగించేవాడు, సకల ఐశ్వర్యాలను అందించేవాడు ఆంజనేయస్వామి అని రమణాచార్య స్వామి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగరి నియోజకవర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మల్కాపూర్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పండితులు రామకష్ణమాచార్యులు, వినయ్ కుమారాచార్యులు, నిర్వాహకులు బుర్ర శరత్, తదితరులు పాల్గొన్నారు.