calender_icon.png 27 December, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీశాఖ మాఫియాను నడుపుతోంది

03-11-2024 12:54:40 AM

  1. అడవి పందులను చంపుతున్నారని రైతులపై థర్డ్ డిగ్రీ
  2. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే నిరాహార దీక్ష
  3. ఎమ్మెల్యే హరీశ్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాం తి): అడవి పందులను చంపుతున్నారనే నెపంతో తమ నియోజకవర్గానికి చెందిన రైతులపై అటవీశాఖ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసిస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. అటవీశాఖ మాఫియాను నడిపిస్తోందని ఆయన అన్నారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అటవీశాఖకు చెందిన కొందరు అధికారులు అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. రైతులను థర్డ్ డిగ్రీతో హింసించారని దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులపైనా కేసులు నమోదు చేశారని తెలిపారు.

పంటలను నాశనం చేకూర్చే క్రమంలో అడవి పందులను చంపినా కేసులుండవని సాక్షాత్తు పీసీసీఎఫ్ చెబుతున్నా కిందిస్థాయి సిబ్బంది తీరు మారడం లేదన్నారు. ఈ విషయమై డీఎఫ్‌ఓ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.

సోమవారం లోపు చర్యలు తీసుకోకుంటే సిర్పూర్ రేంజ్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులు రైతులపై చేసిన దాష్టీకాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మంత్రి కొండా సురేఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.