calender_icon.png 19 September, 2024 | 10:17 PM

ఉమ్మడి ఊరేగింపునకు ఆద్యుడు!

11-07-2024 12:00:00 AM

మూసీనది 1907లో పొంగి నగరాన్ని ముంచేసింది. ప్రజా జీవితం ఛిన్నాభిన్నమైంది. నిజాం కొలువులో ప్రధానమంత్రి అయిన మహారాజ కిషన్ ప్రసాద్ లాల్ దర్వాజ ప్రాంతంలో అమ్మవారికి ఆగ్రహం కలిగిందనీ, అందుకే ఇలాంటి ప్రళయం సంభవించిందని ప్రభువుకు చెప్పారు. అమ్మవారికి పూజ చేయాలని సలహా ఇచ్చారు. ఆయన సలహాతో ఏకీభవించిన నిజాం ప్రభువు అమ్మవారిని దర్శించుకున్నారు. బంగారు చాటలో పసుపు, కుం కుమ, గాజులు, ముత్యాలు, చీర రవిక సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చిన మూసీనది వరద నీటిలో నిమజ్జనం చేశారు. శాంతించాలని కోరుతూ నిజాం నవాబు అమ్మవారికి హారతి ఇచ్చారు. దీంతో మూసీనది వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.

స్వాతంత్య్ర సమరయోధులు, ఉక్కుమనిషి కీ.శే. బి.వెంకటస్వామి ముదిరాజ్ లాల్ దర్వాజ ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు. లాల్ దర్వాజ మాతేశ్వరి ఆల య పునర్నిర్మాణ కమిటీకి అధ్యక్షులు. పాతబస్తీ బోనా లు ఉత్సవాల ఊరేగింపు నిర్వహణకు అధ్యక్షులు. ఆర్య సమాజ్ భావాలున్నప్పటికీ సృష్టికి మూలమైన ఆదిపరాశక్తికి శిరసు వంచి నమస్కరించే వారు. 1952 లో లాల్ దర్వాజ ప్రాంతానికి మొట్టమొదటి కౌన్సిలర్‌గా సేవలు అందించారు. 1955 నుండి దేవాలయానికి అధ్యక్షుడిగా పాతబస్తీ బోనాలు ఉమ్మడి ఊరేగింపు ఉత్సవాలకు అధ్యక్షులు. 1960 నుండి లాల్ దర్వాజ ఉమ్మడి ఊరేగింపు ఉత్సవాల నిర్వహణను తన భుజస్కంధాలపై నిర్వహించారు.

1950 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు బి.వెంకటస్వామి ముదిరాజ్ ఆలయ బాధ్యతలు చేపట్టిన నాటినుండి గుడి నిర్వహణలో చాలా గొప్ప మార్పులు తెచ్చారు. 1950 తరువాతే ఈ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి దానికి ఆనాటికే మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న బి.వెంకటస్వామి ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ మేరకు ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశా రు. ఈ ఆలయాలలో ఉన్న మూడు గుళ్ల స్థావరాలను ఒక దేవాలయంగా రూపొందించి, దానికి ‘మహంకాళి మాతేశ్వరీ దేవాలయం’గా నామకరణం చేశారు. మొద ట మాతా ఆలయంలో జంతుబలులు నిర్వహించరాదని, వాటిని నిషేధించాలని నిరంతరం వారు పోరాడే వారు. వారు ఆ ప్రాంత యువకులందరినీ కూడగట్టి పెద్దలందరికీ నచ్చ చెప్పిన పిదప 1952వ సంవత్సరం నుంచి జంతుబలిని ఈ దేవాలయంలో నిషేధించారు. అప్పటి నుండి అక్కడ గుమ్మడికాయలు, సొరకాయలను బలిగా ఇచ్చేవారు.

ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ కార్యక్రమం ఇదే విధంగా కీ.శే. వెంకటస్వామి ముదిరాజ్ నిర్దేశించిన విధానంలోనే జరుగుతుండడం విశేషం. అదే విధంగా గతంలో చెక్క బొమ్మలాంబను చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 1955 నుండి దానికి బదులుగా ఉత్సవ విగ్రహ ఘటాలను చేయించే కార్యక్రమం నిర్వహించారు. 1958లో వారి అధ్యక్షతన దేవాలయం 50 సంవత్సరాల సందర్భంగా ‘స్వర్ణోత్సవ కార్యక్రమాలు’ ఘనంగా జరిగాయి. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత మీర్, మహమ్మద్, అన్వర్ దేవిడిలో ఉన్న మహంకాళి దేవాలయాన్ని దేవిడి గోడలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తేవడమేకాక శ్రీ నవాడా ముత్తయ్య ముదిరాజ్ 1961లో పునర్ నిర్మా ణం గావించారు.

ఈ దేవాలయమే ‘అక్కన్న- మాదన్న మహంకాళీ దేవాలయం’గా ప్రసిద్ధి పొందిం ది. ఆనాటి వరకు బుధ, గురువారాలతో రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 9 రోజుల (నవరాత్రులు) కార్యక్రమాలుగా జరపడం ఆనవాయితీ అయింది. అది మొదటిరోజు శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుండి ఘటాలను ఊరేగింపుగా తెచ్చి దేవాల యాలలో ప్రతిష్టించడం, బోణాలు నిర్వహించడం, ఆ తర్వాత పోతరాజు రంగం, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు ఈనాటి వరకు జరుగుతున్నాయి.

పాత నగరంలోని మూడు ప్రధాన దేవాలయాల్లో లాల్ దర్వాజ అమ్మవారు, హరికిభోలిలో ఉన్న అక్కన్న- దేవాలయం, గౌలిపురలోగల దేవాల యాలు ఉమ్మడి ఊరేగింపుతో వెళ్ళి మూసీనదిలో విసర్జింపచేయాలని బి. వెంకటస్వామి ముదిరాజ్ ప్రభు త్వంతో నిరంతరం పోరాటాలు చేశారు. మత సామరస్యానికి భంగం వాటిల్లుతుందని భావించి ప్రభుత్వా లు చాలాకాలం ఉమ్మడి ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. ఈ అంశంపై ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించి వారిని ఒప్పించారు. ‘ఇటువంటి కార్యక్రమాల వల్ల మతసామరస్యం విరాజిల్లుతుందని, సర్వమతాలు ఆదరిస్తాయని’ విన్నవించి 1960లో ప్రభుత్వం నుండి అనుమతి పొందారు.

1960 లో ఉమ్మడి ఊరేగింపు ఉత్సవాలకు అధ్యక్షుడిగా అమ్మవారిని సాగనంపు కార్యక్రమానికి పాత నగరం నుండి లాల్ దర్వాజ ఉమామహేశ్వరి, నాగులచింత మీదుకు గౌలిపుర అక్క న్న, మాదన్న సమూహాలతో శాలిబండ, చార్మినార్, పత్తర్‌గట్టి నుండి నయాఫూల్ మూసీనది వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిన ధీశాలి ఆయన! ఆ సంప్రదా యం ఈనాటి వరకు కొనసాగే విధంగా పునాదులు వేసిన మహనీయులు బి.వెంకటస్వామి ముదిరాజ్. 1960 నుండి నిర్వహిస్తున్న ఉమ్మడి ఊరేగింపు కార్యక్రమాలను చార్మినార్ వద్ద రాష్ట్ర ప్రముఖులు స్వాగతించే కార్యక్రమం దేవాలయ 60వ వార్షి కోత్సవం 1968 నుండి దిగ్విజయంగా కొనసాగుతున్నది. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి ఆత్మశాంతికి ఎటువంటి వినోద కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించ లేదు. ఇది తెలంగాణపట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నది. 

అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, రాష్ట్రాలలోని అందరు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులు ఈ దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆలయ విశిష్టతను తెలియజేస్తుంది. శ్రీయుత వెంకటస్వామి స్పూర్తి తోనే మొదట్లో మూడు ప్రాంతాల దేవాలయాలతో ప్రారంభమైన, పరిమితమైన ఈ కార్యక్రమం పాత నగరంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. అనేకానేక దేవాలయాల నుండి మొదటిరోజు ఉమ్మడి ఘటాల ఊరేగింపు కాశీ విశ్వేశ్వర దేవాలయం నుండి బయలుదేరి వివిధ దేవాలయాలకు చేరే కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరగడం, వివిధ విన్యాసాలతో కార్యక్రమాలు నిర్వహించడం, అదే విధంగా చివరిరోజు ఉమ్మడి ఊరేగింపులో విసర్జన కార్యక్రమాలు ఈనాటికి జరుగుతున్నాయంటే ఆనాటి ఉక్కు మనిషి స్వాతంత్య్ర సమరయో ధుడు, ఆర్యసమాజ్ (లాల్ దర్వాజ) వ్యవస్థాపకులు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కీ.శే. బి. వెంకటస్వామి స్పూర్తిదాయకమైన నాయకత్వమే కారణం.

- డా. బండా ప్రకాశ్ ముదిరాజ్, 

రాష్ట్ర అధ్యక్షులు, 

తెలంగాణ ముదిరాజ్ మహాసభ