calender_icon.png 21 March, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ విద్యా పథకాన్ని రాజకీయం చేస్తున్నారు

18-03-2025 01:40:52 AM

బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): విదేశీ విద్యా పథకాన్ని రాజకీయం చేయాలనేది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తపన అని మంత్రి సీతక్క విమర్శించారు. తాను గవర్నమెంట్ స్కూళ్లలో చదివానని, ఎస్టీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్నానని, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం తనదన్నారు.

సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మెస్, డైట్ చార్జీ లు, విదేశీ విద్యా పథకంపై  గంగుల కమలాకర్, రాంచందర్‌నాయక్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. విదేశీ విద్యా పథకం కింద 1,913 మంది చదువుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 210 మంది ఎస్సీలు, 300 మంది బీసీలు, 100 మంది ఎస్టీలు, 500 మంది మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యా పథకానికి ఎంపికైనట్లు తెలిపారు. గత బకాయిలతో కలిపి రూ.167 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.