నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేసి గౌరవ వేతనం చెల్లించాలని వారు చేస్తున్న దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కళ్ళు మూసుకొని నిరసన తెలిపారు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, ఉమా, లక్ష్మి, రాజవ్వ, రజిత, భూదేవి తదితరులు పాల్గొన్నారు.