calender_icon.png 22 April, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాడి ఇంట్లో భోజనం భలే బాగు

14-04-2025 12:00:00 AM

నాగారం, ఏప్రిల్ 13: నాగారం మండల  మాచిరెడ్డిపల్లి గ్రామంలో జినుకల యాదగిరి ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంలో భాగంగా  నాగారం మండల పార్టీ అధ్యక్షుడు తోడుసు  లింగయ్య ఆధ్వర్యంలో భోజనం  కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబాటుగా  పేదవారికి ప్రతి వ్యక్తి కాలికిలో చొప్పున షాపులో బియ్యం అందజేస్తున్నారు.

సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల సమయంల హామీ ఇచ్చామని  ఇచ్చిన మాటకు అనుగుణంగా సన్న బియ్యం ప్రతి కుటుంబానికి అందజేస్తామని అన్నారు. త్వరలో అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల బుచ్చిబాబు పానుగంటి నరసింహారెడ్డి  పసుపులేటి వెంకటరెడ్డి  ఇంద్రసేనారెడ్డి సోమయ్య యాదగిరి  వెంకన్న రమేష్ లింగయ్య నరేష్ శ్రీనివాస్ యాదగిరి ఎల్లయ్య మల్లయ్య ముఖ్య నాయకులు పాల్గొన్నారు.